About GTA
Uniting Telanganites Worldwide — Spreading Telangana Culture & Heritage Across the Globe
Our Vision
Global Telangana Association vision is to become a volunteer driven organization that operates with the most transparent way to support the development activities in Telangana region and USA.
Our Mission
To bring all Telanganites under one umbrella and create a platform to support the needy in Telangana & USA. GTA is formed to provide a platform for literary, cultural, educational, social and development activities in Telangana and USA.
Messages from Our Leaders
Vishweshwar Kalavala
Founder & Advisorతెలంగాణ సమాజాన్నీ ఏకం చేయాలనే మహోన్నత ఆశయం, బలమైన సంకల్పంతో మనమంతా ఏకతాటి పై నడవాలనే ఎన్నారైల ఆకాంక్షల నుంచి మొదలై అందరూ ఏకమై కలసిమెలిసేలా విశ్వవేదిక కు అంకురార్పణ జరుగుతుంది.
తెలంగాణ గడ్డపై పుట్టి మహోన్నత ప్రతిభ పాటవాలతో తమ ప్రజ్న ని చాటుతున్న తెలంగాణ సోదరి సోదరులని ఒకే తాటిపైకి తీసుకువచ్చే ఉన్నత ఆలోచనలకు ప్రతిరూపంగా పురుడుపోసుకుంటుంది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్.
నిస్పాక్షిక సేవే లక్ష్యంగా, తెలంగాణ బిడ్డల కష్ట సుఖాల్లో మేము సైతం అంటూ భరోసా కల్పించడమే ద్యేయంగా తొలి అడుగు వేస్తుంది.
తెలంగాణ బిడ్డలని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తెలంగాణ సమాజాన్ని ప్రోత్సహించడానికి, సంరక్షించడానికి, శాశ్వతంగా సేవలు కొనసాగించడానికి ఏర్పాటవుతుంది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తూ ప్రతి ఒక్కరికి సహాయపడటమే ద్యేయంగా తొలి అడుగు వేస్తుంది. మాతృభూమి ఋణం తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ ఎన్నారైలని ఒక్కటి చేసి సేవా పధంలో సరికొత్తగా ప్రయాణం మొదలు పెడుతుంది.
తల్లిపాల రుణం కొంతైనా తీర్చటమే ప్రధాన లక్ష్యంగా సేవే పరమావధిగా తమని కన్న భూమికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని, ఎందరికో స్ఫూర్తిగ నిలవాలనే సత్సంకల్పం, దృఢమైన ఆలోచనతో ఊపిరులూదుకుంటుంది.
ఇడుపు ఇడుపున జానపదములు ఇంపుగా పూసిన కవనవనంబులు అనే తెలంగాణ చరిత్రని నిజం చేస్తూ సాహిత్య కళాకారులు, సంప్రదాయ జానపద కళలలని ప్రోత్సహిస్తూ తెలంగాణ సంస్కృతిని భవిష్యత్తు తరాలకి అందించాలనే సమున్నత ఆశయాన్ని విశ్వ వేదికగా సాక్షత్కరించేలా తొలి ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా తెలంగాణ గౌరవాన్ని పెంపొందించేలా తెలంగాణ బిడ్డల ఐక్యతని చాటేలా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రయాణం మొదలవుతుంది.
తెలంగాణ బిడ్డ ఏ చోట ఉన్న వారు ఉన్నత అవకాశాలని ఎక్కడ పొందగలరో ఒక మార్గదర్శికి సంస్థ నిలవనుంది.
విద్య, వైద్య, వ్యాపార, న్యాయ, పరోశోధన, సామాజిక అవకాశాలకు వేదికగా, తెలంగాణా బిడ్డలకు సంధానకర్తగా గురుతర బాధ్యతలని తమ కర్తవ్యంగా భావిస్తూ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ముందుకు సాగనుంది.
With the noble aspiration of uniting the Telangana community and a strong determination, the seeds of "Vishwavedika" are being planted from the aspirations of NRIs who wish for everyone to walk together on one path.
Global Telangana Association is born as the embodiment of the noble vision to bring together brothers and sisters of Telangana — born on Telangana's soil — who are showcasing their exceptional talent and capabilities to the world.
With impartial service as its goal, the first steps are being taken with the aim of standing by Telangana's children in their times of hardship and joy, assuring them "we are with you."
Global Telangana Association is established to bring all Telangana children under one platform — to encourage, protect, and provide sustained services to the Telangana community.
With the aim of reflecting Telangana's culture and traditions and helping every individual, the first step is being taken. Uniting Telangana NRIs with the goal of repaying the debt to the motherland, a fresh journey on the path of service begins.
With the primary goal of giving back to the land that nurtured us, and with the noble resolve to be an inspiration to many, this vision takes shape with firm determination and a deep sense of purpose.
Honoring Telangana's rich heritage of folk arts and literature, the first journey begins with the lofty aspiration of encouraging traditional folk arts and literary artists, and bringing Telangana's culture to future generations through a world platform.
Wherever Telangana's children go, whatever land they step on, the Global Telangana Association's journey begins — to enhance the honor of Telangana and proclaim the unity of its people.
Wherever Telangana's children may be, this organization will serve as a guide pointing them to opportunities for growth and advancement.
Serving as a platform for educational, medical, business, legal, research, and social opportunities — and as a connector for Telangana's children — the Global Telangana Association will move forward, embracing these responsibilities as its solemn duty.
Praveen Kesireddy
GTA ChairmanOur mission is to bring all Telanganites under one umbrella and create a platform to support the needy in Telangana & USA. Global Telangana Association is created to promote and support advancement of culture and traditions of Telangana region.
Vishal Reddy Patlolla
GTA Utah PresidentGTA Utah began its journey with a deep commitment to service, social responsibility, and excellence. Our mission is to nurture a vibrant community rooted in culture and tradition, with an outreach not limited by geography, extending across the whole Indian diaspora and the broader global diaspora community.